Pages

Thursday, August 12, 2010

srushtilo lopam ledu mana drushti lone lopamanthaa

ఇవాళ్ళ   చాల బాగున్న  ప్రకృతి  రేపు చూస్తే    ఏమున్నదిట గొప్ప  అనిపిస్తుంది . అంటే నిన్నే మన మనసు బాగున్నది
అందుకే అంతా అందంగా కనిపించింది ,,,ఇలా మన మనసులోనే ఉన్నది  మర్మమంతా ,అలాగే ఒక మనిషి విషయం
తీసుకన్నా  అంతే .నిజానికి  మనుషులంతా మంచివాళ్ళే ...ఎందుకంటే  భగవంతుడి  సృష్టి కదా మన దృష్టి బాగుంటే
అన్నీ బాగుంటాయి .మనతో మనం రొజూ  ఎంత యుద్ధం  చెయ్యాలో ఒక మోస్తరు  మంచిని  పెంచుకోవాలంటే .ఒకవైపు
మనసు కోతిలాగా  మనకి అనుకూలంగా  ఉండేవిధంగా చెప్పి  చెడువైపు లాగుతుంటే   హృదయం  ఘోష  పెడుతూ   ఉంటుంది
చెడు వద్దని .ఎప్పుడూ   హృదయ ఘోష  వినండి ..మనుషులుగా  మనగలగండి.తప్పుల్లెన్నుతు ఉంటె  జీవితమే  తప్పుల తడకగా  మారిపోతుంది .ముందు మన తప్పులు  దిద్దుకుంటే  కదా ఇంకోళ్ళ విషయం మాట్లాడేది .ఇది నేను మీకు  చెప్పేది సుత్తి  కాదర్రా ...నాకు నేను మీతో కలిసి  మననం చేసుకునే   మంత్రం .కళ్ళ జబ్బైతే  కళ్ళద్దాలున్నాయి ,,మనసుకి  దృష్టి  లోపమైతే   చాల తొందరగా  మనసుకి కమ్మిన పొరలు తొలగించే    చికిస్థ  సత్వరమే   చెయ్యాలి .అదీ  మన
చేతులోనే  ఉన్నది అందరం  ఇది ప్రయత్నిద్దామా

Wednesday, August 11, 2010

evarinee aasinchaku

కష్టం ఏదన్నా  మనంచేసాక  దాన్నించి ఫలితం ఆశించకుండా .కాని  చాలాసార్లు మనకి ఆశాభంగమే  ఎదురవుతుంది .అందుకే  ఏదన్నా ఎవరికన్నా చేస్తే  మన ఆనందం కోసమే  చేసామని  అనుకోవడం  ఉత్తమమేమోననిపిస్తుంది .ఎందుకంటే ఎవరి మనసునీ  మనం చదవలెమూ  కంట్రోల్ చెయ్యాలేము .చాలా ఆశాభంగాల  తరువాత  మనకి ఇంకోళ్ళు ఎలా  ఉండాలని  ఉంటుందో    అలా మనం ఉండడం  అభ్యాసం చేస్తే  మనం శాంతిగా ఉండగలుగుతాము అని అనిపించింది ,....కొన్నాళ్ళకి  వాళ్ళకీ  మన మనసు అర్ధం అయ్యే అవకాశం  ఉన్నది .ఎవరితోనన్నా   వాదించడం ఒకటి శుద్ధ దండగని అనిపించిన్దర్రా ...వాదుకు వచ్చు  కీడు వసుధను  అన్న నానుడి ఉండనే  ఉందిగా !
మౌనంగానే  మన మనసు పలికే మధుర భాష  ఓపికగా అందరికీ   చేర్చగలగాలి.అదే  మన సాధనగా   ప్రయత్నిస్తే  ఒకనాటికి
సాధించ గలుగుతాము ...సాధనమున పనులు సమకూరు  ధరలోన  కదా .అందుకేనర్రా మంచి మాటలు  మీ అందరితో  ఇలాపంచుకుంటే   అప్పుడప్పుడు   తప్పుతున్న  దారి  దిశా మళ్ళీ  కనిపిస్తాయని   నా ఆశర్రా .ఇంతకీ ఎవరన్నా చదువుతున్నారో  లేదో ...ఎటువంటి స్పందనా లేదు ...నేనిప్పుడే చెప్పినట్లు  నా ప్రయత్నం  మానను లేన్దర్రా ..అసలే బామ్మని కదా చాదస్తం ఒకటి ఉండనే ఉంటుంది కదా!
పంచుకుంటుంటే

Tuesday, August 10, 2010

prastuthamlo prasthaviiddaamaa!

అన్తేకదర్రా  నిన్న మనది కాదు  రేపు మనది కాదు  కదా .ఇవాల్టి రోజే కదా రేపు ,నిన్న అవుతుందికదా .అందుకే  ఈ రోజు మన చేతనైనంత  బాగా గడపగలగాలి .అంటే  నిన్నటి బాధ మరిచి  రేపటి ఆశతో  బ్రతకాలి .ముందుగా  మనిషిగా కనీస మానవత్వం
మన పరిధిలోనే  చూపగలిగితే  ధన్యులం అయినట్లే .మన బాధే మనదని  ఏదో లోకంలో ఉండకుండా  చుట్టూ  కాస్త గమనించాలి బస్సులో వెళ్తుంటే  నుంచున్న వాళ్ళల్లో  పెద్దవాళ్ళు /లేవలేనివాళ్ళు  ఉంటె చూసీ చూడనట్లు ఉండకుండా  మన సీటు వాళ్లకి ఇవ్వచు . చెప్పొచావు  లేవమ్మా  మనం కూడా అలిసిపోయి ఉంటాం ..అదెక్కడ వీలవుతుంది  అనకండి .ఒక్కక్కసారి  కష్టమే అయినా  చేసాక ఎంత హాయిగా ఉంటుందో  అది అనుభవైకవేద్యమే  సుమా !ఒకసారి రైల్లో షిరిడీ
నుండి తిరుగు  ప్రయాణంలో sideapparlo    మధ్యబెర్తుల గడబడ్లో  మా బెర్తులు సరిగ్గారాలేదు .ఆల్రెడీ బోలెడంత  సామానుతో  రెండుసార్లు అటుఇటు  తిరిగి  అలిసిపొయిఉన్నాము ..మళ్ళి ఎవరోవచ్చి అది వాల్లసీట్ అన్నారు మేము వెళ్ళవలసివచ్చింది
అప్పర్బెర్త్ ..చచమురా భగవంతుడా అనుకుని క్రింద ఉన్న ఓ  చిన్నాబ్బాయిని  కాస్త పైకి  వెళ్ళమని అడిగాం ముసలాల్లమైన మేము .ఎంతకతినంగా కాదన్నాడో తెలుసా ...నేను కావాలని బుక్  చేసుకున్నాను లేవన్నాడు. ఆ రోజు పడిన ఇబ్బంది జన్మలో మరిచిపోలేము .దీనికి వ్యతిరేకంగా మొయ్యలేక  సామాను మెల్లిగా వస్తుంటే ఒక చిన్నబ్బాయి ఒద్దన్నా వినకుండా మా అందరి  సామాను మోసాడు ..అదీ జన్మలో మరిచిపోలేము.ఇంతకీ చేప్పోచెదేమంటే  మనందరం కాస్త మానవత్వం నేర్చుకుందామా !తెలుగు టైపింగ్ వల్ల కొన్ని తప్పనిసరిగా థప్పులొస్థున్నయిఅర్రా ..ఈ బామ్మని  తప్పట్టకండే!

Sunday, August 8, 2010

chirunvvu vela entha?

మరుమల్లె పూవంత .సిరివెన్నెలల్లె  చల్లగా  హాయిగా నవ్వగలగడం  దేవుడిచిన  వరం .ఆ వరాన్ని మనలో చాలామందిమి  దూరం చేసుకున్నాం ...శాపగ్రస్తులం కాకుండా ఉండాలంటే  మళ్లీ మనం నవ్వడం నేర్చుకోవాలి .అందరికీ  ఉంటాయి బాధలు .
కాని మర్చిపోయే  సాధనం కూడా మన దెగ్గిరే ఉన్నది.అసలు పలకరింపుగా  నవ్వడం మన సంస్కృతి ....మనం మర్చి పోయాం
కాని  బాంధవ్యాలు తక్కువ అనబడే అమెరికాలో  మనిషి కనిపిస్తే  చాలు చక్కని చిరునవ్వుతో  హలో చెప్తారు .అది మెకానికల్
అంటారు  చాలామంది ...ఏదైతేనేమి ఆ క్షణం ఎంత హాయిగా అనిపిస్తుందో కదా .ఆ రకంగా మనకి  వాళ్ళు  సాయం చేసినట్లే కదా .అందుకేనర్రా శత్రువు కనిపించినా సరే నవ్వడం నేర్చుకుందాము  ...మొదట్లో సరియిన స్పందన లేకపోయినా  వాల్లూ
మనుషులే కదా తప్పకుండా మారతారు .ఈ లోపల  మనకి అహాన్ని జయించడానికి సాధన అవుతుంది .చిరునవ్వుతో జగాలనే జయించిన దాఖలాలున్నయ్యర్రా ;మౌనాప్రకిటిత దక్షిణామూర్తి తత్వం  చాల శక్తి దాయకమైనది కదా చాల సమస్యల  పరిష్కారానికి ...అది చిరునవ్వుతో అయితే ఇంకా ఫలవంతమౌతుంది .మనమన్దరమూ  ప్రయత్నిద్దామా? బామ్మ మాట మన్నిస్తారుకదర్రా  !

Tuesday, August 3, 2010

prema unte nenunta

అంతే గదా మరి ఏ  పేరు తో  పిలిచినా  భగవంతుడు  పలుకుతాడు  కదా .నేను  సాయి  గురించి  మాత్రమే చెప్పడం  లేదు . ..
ప్రేమ  పెంచుకుని  పంచుకోవడానికి  మనలోని  అరిశాద్వార్గాలనే  కౌరవులని  వధించి  సత్య  ధర్మ ప్రేమ శాంతి  ఆహిమ్సలని  మేలుకొలపాలి .ఈ సాధన సాగించగలిగితే  సహజీవనం  చక్కగా  సాధ్యపడుతుంది .సహజీవన  సౌభాగ్యమే  సమాజనిర్మాణానికి  సహజసిద్ధమైన   సోపానం  కదా .మొట్టమొదట  ఇంట గెలిచి  రచ్చ  గెలవాలిగా ....అంటే మన
సాధన  ఇంట్లోనే మొదలవ్వాలి .భగవంతుడితో  మొదలెట్టి  సమాజం  ఇల్లు అంటున్నదేమిటి   అనుకుంటున్నారా ....దేనికైనా
భగవంతుడి  సహాయం తప్పనిసరి కదా ..కూలిపోతున్న  కుటుంబ  వ్యవస్థకి  కారణం  రాజీ మనస్తత్వం  లేకపోవడమే .రాజీ అనేది  ప్రేమవల్లనే  సాధ్యం.ఆ  ప్రేమ దైవీ గునాలవల్లనే  వస్తుంది  కదా .ఇలా రాస్తున్నాని  నేనేదో  గో ప్పదాన్నని  కాదర్రా
మీతో పంచుకుంటే   నాకూ  ఒక్కసారి మంచిమాట  స్మరించుకోవడం   అవుతుందికదా ..మరి ఈ బామ్మ మాట  మన్నిస్తారు కదూ అనగా  మనమన్దరమూ  దివ్యగునాలని అలవారచుకున్దమర్రా .

sai to manam

సాయి ధామం స్వర్గధామం .అదిచేరుకోవాలంటే అనన్య భక్తి శ్రద్ధలు  అవసరం . ఆ భక్తి శ్రద్ధలకి ఆలవాలం మన మనసు ప్రేమాలయం కావాలి . సాయిభక్తులందరికీ బిజ్జు బామ్మమాటగా ఒక చిన్ని సలహా- మనము పసిమనసు కలిగి ఉండటమే దీనికి ఉచిత మార్గం.