Pages

Wednesday, August 11, 2010

evarinee aasinchaku

కష్టం ఏదన్నా  మనంచేసాక  దాన్నించి ఫలితం ఆశించకుండా .కాని  చాలాసార్లు మనకి ఆశాభంగమే  ఎదురవుతుంది .అందుకే  ఏదన్నా ఎవరికన్నా చేస్తే  మన ఆనందం కోసమే  చేసామని  అనుకోవడం  ఉత్తమమేమోననిపిస్తుంది .ఎందుకంటే ఎవరి మనసునీ  మనం చదవలెమూ  కంట్రోల్ చెయ్యాలేము .చాలా ఆశాభంగాల  తరువాత  మనకి ఇంకోళ్ళు ఎలా  ఉండాలని  ఉంటుందో    అలా మనం ఉండడం  అభ్యాసం చేస్తే  మనం శాంతిగా ఉండగలుగుతాము అని అనిపించింది ,....కొన్నాళ్ళకి  వాళ్ళకీ  మన మనసు అర్ధం అయ్యే అవకాశం  ఉన్నది .ఎవరితోనన్నా   వాదించడం ఒకటి శుద్ధ దండగని అనిపించిన్దర్రా ...వాదుకు వచ్చు  కీడు వసుధను  అన్న నానుడి ఉండనే  ఉందిగా !
మౌనంగానే  మన మనసు పలికే మధుర భాష  ఓపికగా అందరికీ   చేర్చగలగాలి.అదే  మన సాధనగా   ప్రయత్నిస్తే  ఒకనాటికి
సాధించ గలుగుతాము ...సాధనమున పనులు సమకూరు  ధరలోన  కదా .అందుకేనర్రా మంచి మాటలు  మీ అందరితో  ఇలాపంచుకుంటే   అప్పుడప్పుడు   తప్పుతున్న  దారి  దిశా మళ్ళీ  కనిపిస్తాయని   నా ఆశర్రా .ఇంతకీ ఎవరన్నా చదువుతున్నారో  లేదో ...ఎటువంటి స్పందనా లేదు ...నేనిప్పుడే చెప్పినట్లు  నా ప్రయత్నం  మానను లేన్దర్రా ..అసలే బామ్మని కదా చాదస్తం ఒకటి ఉండనే ఉంటుంది కదా!
పంచుకుంటుంటే

No comments:

Post a Comment